
లైటింగ్ సూపర్ బాబుగా సుధీర్ బాబు, సోడాల శ్రీదేవిగా ఆనంది కలిసి నటిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 సినిమాతో తన ప్రతిభ చాటిన కరుణ కుమార్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. 70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజై సూపర్ హిట్ అవగా లేటెస్ట్ గా శ్రీదేవి సోడా సెంటర్ నుండి థర్డ్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
చుక్కల మేలం అంటూ వచ్చిన ఈ సాంగ్ ను కళ్యాణ్ చక్రవర్తి రచించగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు. పెళ్లిసందడిగా వస్తున్న ఈ పాట సినిమాలో చాలా కలర్ ఫుల్ గా ఉంటుందని అనిపిస్తుంది. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై సుధీర్ బాబు చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు.