నాని డేర్ చేయలేకపోతున్నాడా..?

నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటించారు. థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూసిన ఈ సినిమా ఫైనల్ గా అమేజాన్ ప్రైం తో భారీ డీల్ కుదుర్చుకుందని తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరచుకున్నా చిన్న బడ్జెట్ సినిమాలను మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మీడియం బడ్జెట్, భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణాలో థియేటర్లు పూర్తిగా తెరచుకున్నా ఏపీలో నైట్ కర్ఫ్యూ, మూడు షోలు, 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండటంతో కొన్ని సినిమాలు డేర్ చేయలేకపోతున్నాయి.

ఈ లిస్ట్ లో నాని టక్ జగదీష్ ఉన్నట్టు తెలుస్తుంది. థియేటర్లు తెరచుకుని సినిమాలన్ని రిలీజ్ డేట్లు ప్రకటిస్తుంటే నాని నిర్మాతలు మాత్రం సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కే ఓటు వేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ నాని వి సినిమా లాస్ట్ ఇయర్ ఓటీటీ రిలీజైంది. నాని టక్ జగదీష్ దాదాపు డిజిటల్ రిలీజ్ ఫిక్స్ అని తెలుస్తుంది. అయితే చివరి నిమిషంలో నిర్మాతల మనసు మార్చుకుంటారేమో చూడాలి.