వీరమల్లులో 'పంచమి'గా నిధి అగర్వాల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుందని తెలిసిందే. సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో నిధి అగర్వాల్ పంచమి పాత్రలో నటిస్తుంది. హరి హర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. పంచమిగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత అవకాశాలు చాలా వచ్చినా ఆచి తూచి సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ గల్లా అశోక్ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తుంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హరి హర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో నిధి అగర్వాల్ తో పాటుగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా నటిస్తుంది.