రాధేశ్యామ్ 20 నిమిషాలు హైలెట్..!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న రాధేశ్యామ్ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా బాగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాకు 30 శాతం బడ్జెట్ వాటికే కేటాయించినట్టు టాక్. రెండు మూడు రకాల వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలు ఈ సినిమాకు పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదు ప్రభాస్ రాధేశ్యామ్ లో ఈ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చే 20 నిమిషాల సీన్ అదిరిపోతుందని అంటున్నారు. సినిమా హైలెట్స్ లో ఆ 20 నిమిషాల సీన్ కూడా ఉంటుందని చెబుతున్నారు.

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఈ ఇద్దరి జోడీ కూడా సినిమాకు స్పెషల్ ఎత్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న రాధే శ్యాం సినిమా ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి చూపిస్తుందని అంటున్నారు.