పవన్, రానా.. 15న వస్తున్నారు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్ గా వెల్లడించింది. ఈసారి మాములుగా ఉండదు మరి పూనకాలే అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ఖాతాలో పవన్, రానా సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్డేట్ వచ్చింది.

మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో వస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తుండగా రానా డాన్ గా నటిస్తున్నారు. సినిమా టైటిల్ గా రకరకాల పేర్లు వినిపిస్తుండగా ఫైనల్ గా ఆగష్టు 15న ఉదయం 9.45 గంటలకు ఈ క్రేజీ మల్టీస్టారర్ టైటిల్ ఎనౌన్స్ చేస్తున్నారు.