
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో సిద్ధ పాత్రలో చరణ్ అదరగొట్టనున్నారు. కాజల్ అగర్వాల్ తో పాటుగా పూజా హెగ్దే కూడా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న సినిమా నుండి రిలీజైన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు హిందీ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య డబ్బింగ్ రైట్స్ కు భారీ రేటు పలికినట్టు తెలుస్తుంది. ఆచార్య హిందీ డబ్బింగ్ రైట్స్ 26 కోట్ల బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్. సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో భారీ డిమాండ్ ఉంది. ఈ సినిమాల హిందీ మార్కెట్ కూడా బడ్జెట్ లో పరిగణలో తీసుకుంటున్నారు. మెగా మేనియా చూపించేలా ఆచార్య హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడయ్యాయి. సినిమాతో మెగాస్టార్ తన సత్తా చాటనున్నారని చెప్పొచ్చు.