
సుకుమార్, అల్లు అర్జున్ కాంబో సినిమా అంటేనే ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. అల్లు అర్జున్ కు ఆర్య, ఆర్య 2 లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు సుక్కు. ఇక హ్యాట్రిక్ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేశారు. పుష్ప అంటూ పాన్ ఇండియా సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ మాస్ లుక్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
సినిమా కథకు తగినట్టుగా దేవి తన మార్క్ మ్యూజిక్ అందించాడని అనిపిస్తుంది. దాక్కో దాక్కో మేక ప్రోమో సాంగ్ తోనే రచ్చ చేస్తున్న అల్లు అర్జున్ ఫుల్ సాంగ్ తో సినిమాపై మరింత అంచనాలు పెంచుతాడని చెప్పొచ్చు. కచ్చితంగా ఈ సాంగ్.. ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు పండుగ తెచ్చే సినిమా అవుతుందని తెలుస్తుంది. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.