
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ ఓజా (63) మంగళవారం ముంబైలోని లైఫ్ లైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబదిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇంటివద్దే డయాలసిస్ (రక్తశుద్ధి) చేయించుకొంటున్నారు. ఈనెల 8వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గోరేగావ్‌లోని లైఫ్ లైన్ హాస్పిటల్లో చేర్చగా అదే రోజు రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
అనుపమ్ శ్యామ్ యూపీలోని ప్రతాప్ఘర్లో జన్మించారు. కొంతకాలం అన్నాహజారేతో కలిసి ఉద్యమాలలో పాల్గొన్ని జైలుకి కూడా వెళ్లారు. ఆయన హిందీలో స్లమ్ డాగ్ మిలియనీర్, లగాన్, మంగల్ పాండే, గోల్మాల్, వాంటెడ్ తదితర 40 సినిమాలు, అమరావతికీ కహానీయా, వెల్కమ్ తదితర 11 టీవీ సీరియల్స్ చేశారు. ఆయన నటించిన టెలీ సీరియల్ ‘మన్ కీ ఆవాజ్ ప్రతిగ్యా’ సూపర్ హిట్ అవడంతో దానికి కొనసాగింపుగా అదే పేరుతో మరో సీరియాల్లో కూడా ఆయన సజ్జన్ సింగ్ పాత్రలో నటించి మెప్పించారు. అనుపమ్ శ్యామ్ తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ హిందీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు.