
దగ్గుబాటి మల్టీస్టారర్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో రానా నటించిన నా ఇష్టం సినిమాలో వెంకటేష్ ఓ సాంగ్ లో కనిపించాడు. ఈ ఇద్దరు కలిసి నటించే సినిమా కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మనం లాంటి సబ్జెక్ట్ దొరికితే చేయాలని అనుకున్నా అది కుదరట్లేదు. ఈ క్రమంలో వెంకటేష్, రానా కలిసి నెట్ ఫ్లిక్స్ లో ఓ క్రేజీ వెబ్ సీరీస్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. రానా నిర్మాణంలో నెట్ ఫ్లిక్స్ లో ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేశారు. ఈ వెబ్ సీరీస్ లో రానాతో పాటుగా వెంకటేష్ కూడా నటిస్తారని టాక్.
ఈ వెబ్ సీరీస్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు. ఈ వెబ్ సీరీస్ కథ ఏంటి అన్నది త్వరలో తెలుస్తుంది. వెంకటేష్, రానా కలిసి సినిమానే చేయాలని అనుకున్నారు కాని సినిమాకు కావాల్సిన సబ్జెక్ట్ మెటీరియల్ కాకపోవదంతో వెబ్ సీరీస్ చేయాలని అనుకున్నారు. వెంకటేష్, రానా ఇద్దరు కలిసి ఈ వెబ్ సీరీస్ లో నటిస్తున్నట్టు టాక్. ఈ వెబ్ సీరీస్ కు సంబందించిన అఫీషియల్ డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.