రష్మిక @ 20 మిలియన్స్..!

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన అమ్మడు తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తన టాలెంట్ తో వరుస స్టార్ అవకాశాలను అందుకున్న అమ్మడు స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటుగా తమిళ సినిమాల్లో కూడా ఛాన్సులు అందుకుంటున్న రష్మిక మందన్న తన ఇన్ స్టాగ్రాంలో అరుదైన రికార్డ్ సాంధించింది. ఇన్ స్టాగ్రాం లో 20 మిలియన్ ఫాలోవర్స్ తో అందరికన్నా ముందంజలో ఉంది కన్నడ భామ. 

సౌత్ భామలే కాదు బాలీవుడ్ భామలను కూడా వెనక్కి నెట్టేస్తూ రష్మిక మందన్న ఈ రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న రష్మిక శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటుగా తమిళంలో మరో సినిమా తెలుగులో మరో స్టార్ సినిమా అవకాశాన్ని అందుకుందని టాక్. నేషనల్ క్రష్ తో పాటుగా ఇన్ స్టాగ్రాం లో 20 మిలియన్ ఫాలోవర్స్ తో రష్మిక సత్తా చాటుతుంది.