
సర్కారు వారి పాట తర్వాత మహేష్ మరోసారి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు సంబందించిన క్రేజీ న్యూస్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఎనౌన్స్ చేశారు. సినిమాలో హీరోయిన్ గా ఇన్నాళ్లు ఎవరెవరి పేర్లో వినపడగా ఫైనల్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దేని ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించబోతున్నాడని ఎనౌన్స్ చేశారు.
అల వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రం తో బాగా ట్యూనప్ అయిన థమన్ మరోసారి అతనితో వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ మహేష్ సర్కారు వారి పాట సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ మహేష్ సినిమాలతో థమన్ అదరగొట్టబోతున్నాడు. మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో ఈసారి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.