సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్..?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్, కె.ఎస్ రవీంద్ర సినిమాలను చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటుగా మెహెర్ రమేష్ డైరక్షన్ లో చిరంజీవి తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ మూవీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చిరుతో పాటుగా కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో చిరంజీవి సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని టాక్.

స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాంలో ఉన్న కీర్తి సురేష్ అప్పుడే సిస్టర్ రోల్ చేయడం ఏంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మెగాస్టార్ సినిమాలో సిస్టర్ రోల్ అంటే అది తన కెరియర్ కు ఎంతోకొంత హెల్ప్ అవుతుందని భావిస్తుంది కీర్తి సురేష్. మొదట్లో ఈ పాత్ర కోసం నయనతారని తీసుకుంటారని వార్తలు రాగా లేటెస్ట్ గా కీర్తి సురేష్ కే ఆ ఛాన్స్ వచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ తన సత్తా చాటాలని చూస్తుంది.