ఓటీటీకే జై కొడుతున్న స్టార్ హీరో.. అందుకే ఆ నిర్ణయం..!

ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీపై పడిందని తెలిసిన విషయమే. లాస్ట్ ఇయర్ నుంచి మొదలైన కరోనా వైరస్ ప్రభావంతో సినిమా థియేటర్లు, షూటింగ్స్ అన్నీ ఆపివేశారు. లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత మళ్లీ షూటింగ్స్ మొదలై.. థియేటర్ల తెరిసేందుకు అనుమతించినా.. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మళ్లీ మొదటికే వచ్చింది. ఈ క్రమంలోనే చిన్నా పెద్ద చిత్రాలు ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాయి. ఇక ఓటీటీ విడుదలకు ముందడుగు వేసిన ఫస్ట్ హీరో సూర్య అనే చెప్పాలి.  తన చిత్రం పొన్మగల్ వంధాల్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి పెట్టారు. దాంతో ఆయనపై థియేటర్ల యాజమాన్యాలు.. డిస్ట్రిబ్యూటర్స్.. ఎగ్జిబిటర్స్ పెద్ద ఎత్తున తిరగబడ్డారు. ఇదే క్రమంలో సెకండ్ వేవ్ మొదలు కావడంతో అందరికీ ఓటీటీ దిక్కు అవడంతో సైలెంట్ అయ్యారు. సూర్య నటిస్తూ నిర్మించిన ఆకాశం నీ హద్దురా సినిమాని కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు.  

ప్రస్తుతం సూర్య థియేటర్ల కన్నా ఓటీటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అందుకే 2డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న జై భీమ్ సినిమాతో పాటుగా రామే ఆండాలుమ్ రావనే ఆండాలుమ్, ఉదంపిరప్పే, ఓ మై డాగ్ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నాలుగు చిత్రాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే తమిళ నాట మిగత హీరోలు కూడా సూర్యనే ఫాలో అవుతారా లేదా అన్నది చూడాలి.