
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒకే ఫ్యామిలీ హీరోలు తెరపై కనిపించడం చాలా అరుదైన విషయం అనే చెప్పాలి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ తమ తనయులతో నటించిన చిత్రాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఇలా ఒకే తెరపై తండ్రీ కొడుకుల కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎన్నో ఆసక్రికరమైన విషయాలు.. కథనాలు వెలువడ్డాయి. మొత్తానికి ఈ చిత్రంలో మెగాస్టార్ చిరు ఆయన తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది.
ఆచార్య టాకీ పార్ట్ పూర్తి కాగా, కేవలం రెండు సాంగ్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. రెండు పాటల చిత్రీకరణతో ఆచార్య షూటింగ్ పూర్తి కానుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. తాజాగా ఆచార్య సెట్స్ నుండి చిరు, చరణ్ కలిసి ఉన్న ఫోటో పంచుకున్నారు చిత్ర యూనిట్. ఖాకీ డ్రెస్ వేసుకొని నక్సల్స్ గెటప్స్ లో ఉన్న చిరు, చరణ్ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ ఆనంద పడిపోతున్నారు. కేవలం అర్థగంట మాత్రమే ఉండే చరణ్ పాత్ర మూవీ లో కీలకం అని అంటున్నారు. ఈ మూవీలో నటుడు సోనూ సూద్, నటి సంగీత కీలక రోల్స్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ సరసన అందాల భామ కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.