వరుణ్ తేజ్ గని.. దీపావళికి రిలీజ్..!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో దూసుకు పోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ హిట్ తర్వాత స్పోర్ట్స్ నేపథ్యంలో బాక్సీంగ్ ఛాంపియన్ గా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా ప్రభావంతో ఆలస్యం జరిగింది. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేశాడు. అలాగే ఎప్పటికప్పుడూ జిమ్‏లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. 

ఈ మద్యనే జిమ్‏లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు వరుణ్‌ తేజ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రంలో ఇక వరుణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.