ప్రకాశ్ రాజ్ ట్వీట్.. మళ్లీ ముదురుతున్న 'మా' ఎన్నికల గోల..!

జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. టివి సీరియల్ లో కెరీర్ ఆరంభించిన ఆయన తర్వాత తన మల్టీ టాలెంట్ తో పలు భాషా చిత్రాల్లో నటించి నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉన్న ప్రకాశ్ రాజ్ ఇటీవల మా ఎన్నికల్లో అధ్యక్ష పదవీ పోటీకి సిద్దమయ్యారు. అప్పటి నుంచి నాన్ లోకల్ ప్రస్థావన మొదలైంది. దీనిపై ఇప్పటికే పలు దుమారాలు చెలరేగాయి. ఈ క్రమంలోనే మా అధ్యక్షలు నరేష్, ప్రకాశ్ రాజ్, నాగబాబు ల మద్య మాటల యుద్దం జరిగింది. 

'మా' ఎన్నికల వ్యవహారం మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్న విషయం తెలియంది కాదు. బరిలో దిగేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అనేలా పోటీలో ఉన్న 5గురు సిద్దమైనా  వారిలో ముగ్గురు ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నా.. ప్రస్తుతం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌ల మధ్య మాత్రం ఇన్ డైరెక్ట్‌గా వార్ నడుస్తుందనేది వారి చర్యల ద్వారా తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ చేసిన ట్విట్ ఇప్పుడు కొత్త వైరం మొదలైందంటున్నారు. తెగేదాకా లాక్కండి అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతోంది. అది కూడా  తెలుగులో ట్వీట్ చేశారు. ప్రస్తుత 'మా' కార్యవర్గాన్ని ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్ చేశారనేలా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ఏకగ్రీవానికి సుముఖంగా లేమని ఎన్నికలకు వెళ్లడం ఖాయం అనేలా ట్వీట్లు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.