
తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్ గా సుజిత్ దర్శకత్వంలో సాహెూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్ద ఫలితం దక్కలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్నాడు. రాధేశ్యామ్,సలార్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాల తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైజయంతి బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనెలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరో హీరోయిన్ పాత్రలో సమంత నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫిలిమ్ వర్గాల్లో మరో చర్చనడుస్తుంది. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు నటించబోతున్నారట. ఫుల్ లెంగ్త్ కాకున్న ఈ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉండబోతుందట.
ఇంతకీ ఆ ఇద్దరు టాప్ హీరోలు ఎవరా అనుకుంటున్నారా.. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న నేచురల్ స్టార్ నాని, అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ. ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు నాగ్ అశ్విన్ కి మంచి స్నేహితులు.. వీరి కాంబినేషన్ లో ఎవడే సుబ్రహ్మణ్యం ద్వారా మంచి అవకాశం దక్కింది. అందులో నాని హీరోగా నటించగా విజయ్ ఒక స్నేహితుడు పాత్రలో నటించాడు. నాగ్ అశ్విన్ ఎప్పుడు పిలిచినా కూడా.. ఎలాంటి పాత్రల్లో నటించడానికి అయినా విజయ్ దేవరకొండ సిద్ధంగా ఉంటాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ లాంటి అగ్రహీరోతో సినిమా కోసం అంటే విజయ్ మరింత ఇంట్రెస్ట్ చూపిస్తాడని చెప్పవచ్చు. మొత్తానికి ఈ కాంబినేషన్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ కథ రెడీ చేశారని సమాచారం.