
సినీ రచయిత బండారు దానయ్య డైరక్టర్ గా చేస్తున్న మరో ప్రయత్నం చిత్రపటం. ఈ సినిమాలో పార్వతీశం, శ్రీవల్లి జంటగా నటిస్తున్నారు. శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో పుప్పాల శ్రీధర రావు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో నింగిని చూసి నేర్చుకున్న సాంగ్ ను బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇంటర్నెట్ లో మనిషికి కావాల్సిందల్లా దొరుకుతుంది.. కాని దొరకనిదల్లా ఎమోషన్ మాత్రమే అది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నామని అన్నారు డైరక్టర్ దానయ్య. తండ్రి కూతురు మధ్య ఎమోషనల్ గా సాగే కథతో ఈ సినిమా అందరిని అలరిస్తునని అంటున్నారు. సినిమాలోని సాంగ్ రిలీజ్ చేసిన విజయేంద్ర ప్రసాద్ మంచి కథ.. మంచి టైటిల్.. సాహిత్యం.. సంగీతం కూడా బాగున్నాయని చిత్రయూనిట్ ను అభినందించారు. సినిమా ట్రైలర్ త్వరలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ చెబుతున్నారు.