సుధీర్ బాబు శ్రీదేవి ఎవరంటే..!

సుధీర్ బాబు హీరోగా పలాస 1978 ఫేం కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇన్నాళ్లు శ్రీదేవి ఎవరన్నది సీక్రెట్ గా ఉంచారు. ఫైనల్ గా సినిమాలో ఫీమేల్ లీడ్ ను పరిచయం చేశారు చిత్రయూనిట్. సుధీర్ బాబు సినిమాలో సోడాల శ్రీదేవిగా నటిస్తుంది ఆనంది. రీసెంట్ గా జాంబి రెడ్డి సినిమాతో అలరించిన ఈ అమ్మడు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో మరోసారి అలరించాలని చూస్తుంది.

హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో కూడా సినిమాపై అంచనాలు పెంచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో లైటింగ్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారు. ఈ సినిమా నుండి ఈమధ్య రిలీజైన సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సగీతం పరంగా కూడా ఆడియెన్స్ ను అలరిస్తుందని తెలుస్తుంది.