లూసిఫర్ రీమేక్ షూటింగ్ డేట్ ఫిక్స్..!

ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లూసిఫర్ రీమేక్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 13 నుండి షూట్ కు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారని టాక్. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ మూవీతో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డబుల్ యాక్షన్ చేస్తున్నట్టు టాక్. సినిమాకు వీరయ్య టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీఅకు వెళ్తుందని ఫిల్మ్ నగర్ టాక్.