సీరియల్ ప్రమోషన్స్ లో కృతి శెట్టి..!

సూపర్ స్టార్ మహేష్ తర్వాత అలాంటి క్రేజ్ తెచ్చుకుంది ఉప్పెన భామ కృతి శెట్టి. చేసింది ఒక్క సినిమానే అయినా కృతి శెట్టికి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. వరుస ఐదారు సినిమాలు చేస్తున్న కృతి శెట్టి మరోపక్క సీరియల్ ప్రమోషన్స్ కూడా చేస్తుంది. జీ తెలుగులో సీరియల్ ప్రమోషన్స్ లోసం స్టార్ హీరోలను వాడుకుంటారు ఈ క్రమంలో మహేష్ బాబుని జీ తెలుగు వారు వాడేశారు. జీ తెలుగులో వస్తున్న సీరియల్స్ కు మహేష్ ప్రమోట్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ ఛాన్స్ అందుకుంది కృతి శెట్టి.

ఉప్పెన సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు మనసులు దోచేసిన కృతి శెట్టి ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అందుకే ఆమెతో సీరియల్స్ ప్రమోట్ చేయిస్తే బెటర్ అన్న ఆలోచనతో కృతి శెట్టితో జీ తెలుగు సీరియల్స్ ప్రమోట్ చేయిస్తున్నారు. ఈ సీరియల్స్ ప్రమోషన్స్ కోసం కృతి శెట్టికి కోటి దాకా రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించిచి మీకు చెప్పాలి, రాం తో ఒక సినిమా చేస్తుంది కృతి శెట్టి. ఈ సినిమాలతో పాటుగా నాగార్జున బంగార్రాజు సినిమాలో కూడా అమ్మడు చైతు సరసన ఛాన్స్ అందుకుందని టాక్.