ప్రభాస్ ప్రాజెక్ట్ K లో సమంత..?

సలార్ తో పాటుగా ఆదిపురుష్ సినిమాతో కూడా బిజీగా ఉన్న ప్రభాస్ ఈ రెండు సినిమాలే కాకుండా లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రాజెక్ట్ K ముహుర్తం పెట్టుకున్నాడు. వైయనతి బ్యానర్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుందని టాక్. ఆఫ్టర్ మ్యారేజ్ సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో కూడా సమంతకు స్పెషల్ రోల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి సినిమాలో కూడా సమంత స్పెషల్ రోల్ లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు అదే సెంటిమెంట్ తో ప్రాజెక్ట్ K లో కూడా సమంతని భాగం చేస్తున్నారని తెలుస్తుంది. సమంతతో పాటుగా మళయాళ స్టార్ పృధ్వి రాజ్ సుకుమారన్ ను కూడా ఈ సినిమాలో తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.