సత్యదేవ్ తిమ్మరుసు ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్.టి.ఆర్..!

యువ హీరోల్లో పాండమిక్ టైం లో కూడా వెబ్ సీరీస్, ఓటీటీ సినిమాలతో అలరిస్తూ వస్తున్న సత్యదేవ్ లేటెస్ట్ గా శరణ్ కొప్పిశెట్టి డైరక్షన్ లో వస్తున్న సినిమా తిమ్మరుసు. ఈ నెల 30న రిలీజ్ ప్లాన్ చేస్తున్న సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు.

ఇక తిమ్మరుసు ట్రైలర్ విషయానికి వస్తే.. సిన్సియర్ లాయర్ అయిన హీరో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ కేసు విషయమై కూపీ లాగుతాడు. ఆ కేసుకి తనకు జరిగే పరిణామాలకు సంబంధం ఉందని భావిస్తాడు. ఫైనల్ గా హీరో ఆ కేసుని ఎలా గెలిచాడు అన్నది సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సినిమాలో సత్యదేవ్ మరోసారి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని అనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమాగా తిమ్మరుసు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.