గని కోసం తమన్నా గ్లామర్ టచ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో మరింగ గ్లామర్ టచ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని దించుతున్నారట. సినిమాలో తమన్నాతో ఒక స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. ఈ సాంగ్ కోసం అమ్మడు భారీగా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. గని సినిమాలో ఐటం సాంగ్ కోసం తమన్నాకి 75 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

సినిమాలో ఈ సాంగ్ కూడా హైలెట్ గా నిలిచేలా చేస్తున్నారట. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ గనితో కూడా తన ఖాతాలో మరో హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు. గనితో పాటుగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్ 3 సినిమాను చేస్తున్నాడు వరుణ్ తేజ్.