సీనియర్ నటి జయంతి కన్నుమూత..!

దక్షిణాది సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలిచిన సీనియర్ నటి జయంతి (76) ఆదివారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది రావడంతో బెంగుళూరులో ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూనే జయంతి మృతి చెందారు. ఎప్పటి నుండో ఆమె ఆస్తమాతో బాధపడుతున్నారని తెలుస్తుంది. 

1963లో జెనుగూడు అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన జయంతి తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, మళయాళ, కన్నడ భాషల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 500 పైగా సినిమాల్లో నటించిన జయంతి 300పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో భార్యభర్తలు సినిమాతో కెరియర్ ఆరభించిన జయంతి చాలా సినిమాల్లో నటించారు. జయంతి మృతి పట్ల తెలుగు చల చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.