
వరుస ఫ్లాపులతో దర్శకుడిగా క్రేజ్ తగ్గిన ఈ సందర్భంలో తన సత్తా చాటేందుకు వస్తున్నాడు డైరక్టర్ పూరి జగన్నాథ్. కళ్యాన్ రాం తో ఇజం మూవీ చేస్తున్న పూరి సినిమాను హిట్ టార్గెట్ తో షూట్ చేస్తున్నాడట. ఆ కసి ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి రిలీజ్ అయిన టీజర్ దాకా కనిపిస్తూనే ఉంది. ఇక సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చే ప్రయత్నంలో ఇజంలో ఎన్.టి.ఆర్ తో ఓ సర్ ప్రైజ్ రోల్ ప్లాన్ చేశాడట పూరి.
రీసెంట్ గా జనతా గ్యారేజ్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న తారక్ ఇజంలో కనిపిస్తే అదో సెపరేట్ క్రేజ్ ఏర్పడే అవకాశాలున్నాయని అనుకున్నారట. కాని తారక్ మాత్రం అభ్యంతరం వ్యక్త పరచడంతో కనీసం అతనితో వాయిస్ ఓవర్ అయినా ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇజంలో ఎన్.టి.ఆర్ కనిపిస్తాడనుకుంటే ఫ్యాన్స్ ఆశలకు నీళ్లు చల్లుతూ కేవలం తన వాయిస్ మాత్రమే వినిపిస్తున్నాడు జూనియర్.
మొదటిసారి కళ్యాణ్ రాం ఓ స్టార్ డైరక్టర్ తో చేస్తున్న సినిమా ఇజం. పటాస్ తో హిట్ ట్రాక్ ఎక్కినట్టు కనిపించిన కళ్యాణ్ రాం షేర్ తో మళ్లీ బ్యాక్ అయ్యాడు. మరి ఈ ఇజం తనలోని మాస్ ఇజాన్ని బయటకు తెస్తుందో లేదో చూడాలి. సిక్స్ ప్యాక్ తో దర్శనమివ్వబోతున్న కళ్యాణ్ రాం సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టేస్తున్నారట. మరి ఫలితం కూడా అదే రేంజ్లో ఉంటుందో లేదో చూడాలి.