
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ తన మొదటి రెమ్యునరేషన్ విషయాలని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు సినిమాకు కోటి కొటిన్నరకు తగ్గకుండా చేస్తున్న రెజినా కెరియర్ మొదట్లో కేవలం 6 లక్షలకు సినిమా చేసిందట. గిల్లి, కెరటం, తడైయారా తాక్కా ఈ మూడింటిలో ఏ సినిమాకు అమ్మడు అంత తక్కువ పారితోషికం తీసుకుందో కాని ఒకప్పటి రెమ్యునరేషన్ గుర్తుచేసుకుని నవ్వుకుంటుంది రకుల్.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్ని స్టార్స్ హీరోలతోనే.. చేస్తున్న ప్రతి సినిమా అమ్మడికి మంచి బూస్టప్ ఇవ్వడంతో కెరియర్ లో తక్కువ టైంలోనే సూపర్ క్రేజ్ సంపాదించింది రకుల్. ఇక ఇప్పుడేమో కోట్లు డిమాండ్ చేస్తున్న ఈ భామ మొదటి సినిమా 6 లక్షలకు అంటే గొప్ప విషయమే అని చెప్పాలి.
మోడల్ గా కెరియర్ ప్రారంభించి హీరోయిన్ గా టర్న్ అయిన రకుల్ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయ్యింది. ఇక్కడ చిన్న సినిమాతో మొదలైన అమ్మడి ప్రస్థానం స్టార్స్ కు హీరోయిన్ గా మొదటి ఆప్షన్ తనే అన్న రేంజ్లో ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. మరి ఇదే ఫాంతో మరిన్ని గొప్ప సినిమాల్లో నటించాలని ఆశిద్దాం.