నా సినిమా ఈవెంట్ కి రావొద్దు ప్లీజ్- రామ్

నేను శైలజ సక్సెస్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన రామ్, ఇప్పుడు హైపర్ అంటూ వచ్చేస్తున్నాడు. సినిమాలోని సాంగ్ టీజర్స్ ని ఇప్పటికే విడుదల చేసిన చిత్ర యూనిట్, ఇవాళ ట్రైలర్ విడుదల చేసే పని పెట్టుకున్నారు. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ ఫంక్షన్ కి, అభిమానులను రావొద్దంటూ రామ్ ట్వీట్ చేశాడు.

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పాడైన రోడ్లను దృష్టిలో ఉంచుకొని, ఏ మాత్రం ఇబ్బందిగా ఉన్నా, ఫంక్షన్ కి రాకందని, టీవీ లోనే చూడండంటూ రామ్ ట్వీట్ చేశాడు. గతంలో రామ్ తో కందిరీగ డైరెక్ట్ చేసిన సంతోష్ శ్రీనివాస్ ఇప్పుడు హైపర్ చేశాడు. శివమ్ తర్వాత రాశీ ఖన్నా మరో సారి రామ్ తో నటిస్తున్న చిత్రమిది. దసరా కి హైపర్ ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Click to read this news in English