
మరాఠిలో కేవలం నాలుగు కోట్లతో నిర్మించబడి వందకోట్ల కలక్షన్స్ సాధించిన సైరత్ మూవీ మీద ఇప్పుడు సౌత్ మేకర్స్ కన్నుపడ్డది. ఇప్పటికే తెలుగు తమిళ మలయాళ భాషల్లో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలుగు సైరత్ మూవీ హీరో దర్శకుడు ఫిక్స్ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనయుడు గౌతం హీరోగా తెలుగు సైరత్ రాబోతుందట. ఇక సినిమాకు దర్శకుడిగా యువత, సోలో లాంటి హిట్లతో క్రేజ్ ను సంపాదించి రీసెంట్ గా అల్లు వారి అబ్బాయితో శ్రీరస్తు శుభమస్తు అని హిట్ అందుకున్న పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడట.
ఇప్పటికే గౌతం ఫైనల్ కాగా పరశురామే డౌట్ అన్నట్టు తెలుస్తుంది. అయితే అంత సూపర్ హిట్ అయిన ఆ సినిమా హీరోగా ఏమాత్రం క్రేజ్ లేని గౌతంతో తీసేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదట పరశురాం. ఇక ఇదే సినిమా కోసం మరో పెద్ద హీరో తన ప్రొడక్షన్ లో నిర్మించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. అంతేకాదు ఓ కుర్ర హీరోని ఇప్పటికే ఆ సినిమా కోసం సెలెక్ట్ చేశారని టాక్. సో ఈ ఫైనల్ గా సైరత్ మూవీ ఎవరి చేతిలో పడుతుందో తెలియదు కాని సినిమా మీద మాత్రం ముంచే అంచనాలను పెంచేస్తున్నారు సిని జనాలు.