దాసరి పవన్ లకు బోయపాటి షాక్..!

దాదాపు రెండు సంవత్సరాల క్రితం నుండి దాసరి నారాయణ రావు నిర్మాతగా పవర్ స్టార్ తో ఓ సినిమా ఉంటుందని హడావిడి చేస్తున్నారు. ఇక దానికి సంబందించిన పనులు ఏమాత్రం ముందుకు కదలట్లేదు అయితే ఈమధ్య దాసరితో చర్చలు జరిపిన పవర్ స్టార్ సినిమాకు సిద్ధమన్నట్టు చెప్పాడట. ఇక ఆ కాంబోలో దర్శకుడిగా చేసేందుకు ఎవరిని సెలెక్ట్ చేయాలా అని వెతకడం మొదలు పెట్టారు. ముందు త్రివిక్రం లాంటి దర్శకుల పేర్లు వినపడ్డా త్రివిక్రం చినబాబుతో తప్ప ఎవరితో సినిమా చేయడని తెలిసి సైలెంట్ అయిపోయారు.

అయితే ఇప్పుడు మంచి ఫాంలో ఉన్న బోయపాటిని అడిగితే మాత్రం దాసరికి షాక్ ఇచ్చే ఆన్సర్ ఇచ్చాడట. పవన్ ను డైరెక్ట్ చేసేందుకు ఓకే చెప్పిన బోయపాటి సినిమా కథ మాత్రం తాను అనుకున్నదే అని చెప్పాడట. ఇప్పటికే పవన్ కోసం దాసరి 'బోస్' అనే కథ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడు. మరి బోయపాటికి ఆ కథ నచ్చలేదో మరేమో కాని పవన్ దాసరిలకు బోయపాటి అదిరిపోయే షాక్ ఇచ్చాడు. 

ఇక ప్రస్తుతం కాటమరాయుడా సినిమా చేస్తున్న పవన్ ఇది పూర్తి చేసిన వెంటనే త్రివిక్రంతో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇక ఉంటే కనుక దాసరి నిర్మాణంలో సినిమా ఆ తర్వాత ఉండే అవకాశం ఉంది. మరి ఏ దర్శకుడు ఈ ఇద్దరిని ఇంప్రెస్ చేసి సినిమా తీస్తాడో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.