ఆ హీరోని పట్టేస్తున్న మారుతి..!

చిన్న సినిమాలతో మొదలై పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే రేంజ్ కు ఎదిగిన మారుతి ఇప్పటికి తన మార్క్ స్మాల్ బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇచ్చేందుకు రెడీగా ఉంటాడు. ఒక్కసారి స్టార్ హీరో సినిమా చేశాక ఇక మళ్లీ వారితోనే చేయాలి అన్న కండీషన్స్ ఏం లేకుండా మారుతి ఇప్పుడు ఓ కుర్ర హీరోతో సినిమకు సిద్ధమవుతున్నాడట. ఇక మారుతి మనసు గెలిచిన హీరో ఎవరో కాదు పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ.

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆ తర్వాత హీరోగా పెళ్లిచూపులు పెద్ద సక్సెస్ అందుకున్నాడు. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతలంతా విజయ్ వెంట పడుతున్నారు. ఇక వారిలో మారుతి కూడా ఉన్నాడని టాక్. ప్రస్తుతం రెండు కథలను సిద్ధం చేసుకున్న మారుతి ఒకటి విజయ్ కోసం కాగా మరోటి ఓ పెద్ద హీరో కోసం అని తెలుస్తుంది.

మరి విజయ్ ను పట్టేయాలని చూస్తున్న మారుతికి ఇదో రకంగా అతనికి లక్కీ ఛాన్స్ వచ్చేసినట్టే. బాబు బంగారంతో వెంకటేష్ ను ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో ఆ రేంజ్లో చూపించిన మారుతి తన చేతిలో ఏ హీరో సినిమా పడినా అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క.