
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మరో రెండు రోజుల్లో మజ్నుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న నాని మజ్ను విషయంలో కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. అయితే ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు కాస్త డల్ సర్టిఫికెట్ ఇచ్చారట. సినిమా యు/ఏ పొందినా నాని మార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో లేదని ఇన్నర్ టాక్. ఇక దానికి తోడు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా దర్శక నిర్మాతలెవరు ప్రమోషన్స్ చేయకపోవడంతో నాని ఏం చేయలేని పరిస్థితి అయ్యింది.
కొద్దికాలం హిట్ కోసం పోరాడిన నాని ఇప్పుడు అది తన ఇంటి పేరుగా మార్చుకున్న పరిస్థితులు కనబడుతున్నా రాబోతున్న మజ్ను విషయంలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడం కాస్త కంగారు పెట్టిస్తుంది. అయితే ప్రమోషన్స్ సరిగా చేయకపోవడానికి వినిపిస్తున్న మరో మాట ఏంటంటే ఎలాగు సినిమా మంచి కంటెంట్ తో వస్తుంది కాబట్టి అంతగా ప్రమోషన్స్ కూడా అవసరం లేదు అందుకే చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారని అంటున్నారు.
మరి రిలీజ్ ముందు ఇంత చప్పగా ఉంటే రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ చేసినా ఫలితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం రేసులో దూసుకెళ్తున్న నాని మజ్ను విషయంలో ఎందుకు ఇలా లెక్క తప్పాడో అర్ధం కావట్లేదు. అది సినిమా మీద నమ్మకంతోనేనా లేక నిరాశతోనా అన్నది రిజల్ట్ వస్తేనే కాని చెప్పలేం.