బాలయ్య సినిమాకు నాలుగు టీంలు.. సరికొత్త రికార్డ్..!

బాలయ్య కెరియర్ లో స్పెషల్ గా నిలిచేలా చేస్తున్న తన వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాకు ముందు అనుకున్న ప్రకారం యుద్ధ సన్నివేశాలన్ని షూట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సీక్వెన్సెస్ కు గ్రాఫిక్ వర్క్స్ కోసం నాలుగు టీములను రంగంలో దించుతున్నారట. ఇలాంటి సినిమాలో మేజర్ రోల్ పోషించే వి.ఎఫ్.ఎక్స్ లో పర్ఫెక్ట్ గా ఉండేలా ఈ నాలుగు టీంలతో పనిచేయిస్తున్నారట చిత్రయూనిట్. 

ఇక అక్టోబర్ ఎండింగ్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ మొదటి వారం ఆడియో వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య రాజుగా కనిపించనున్న ఈ సినిమా తన కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు ఓ సినిమాకు ఇలా నాలుగు గ్రాఫిక్స్ టీంలు పనిచేయడం కూడా కొత్త రికార్డ్ అని చెప్పాలి.

ఇప్పటికే బాహుబలి కోసం పనిచేస్తున్న టీం అంతా ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే బాహుబలిలో కన్నా ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు బాగుంటాయట. ప్రస్తుతం మధ్యప్రదేష్ లోని కోటలో షూటింగ్ జరుపుకుంటున్న శాతకర్ణి యూనిట్ కొద్దిరోజుల్లో అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రానున్నారు.