సందడి చేస్తున్న బాహుబలి ఆన్ లొకేషన్స్ పిక్స్..!

బాహుబలి 2 షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ సందర్భంలో సినిమాకు సమబందించిన క్వారీలోని ఆన్ లొకేషన్ పిక్స్ లీక్ అయ్యాయి. క్లైమాక్స్ షూట్ ప్రారంభంలో మొదటిరోజు షూటింగ్ సక్సెస్ అంటూ ఓ పిక్ పెట్టి ఊరించిన రాజమౌళి ఆ తర్వాత షూటింగ్ విశేషాలేవి బయటపెట్టలేదు. క్లైమాక్స్ మొత్తం పూర్తి చేసుకుని ఇప్పుడు టాకీ పార్ట్ షూటింగ్ లో ఉన్న బాహుబలి టీం రాయలసీమలోని ఓ క్వారి లో షూట్ చేస్తున్నారు.  

క్వారీలో ఓ చిన్న నీటి మడుగు.. కేవలం ఇదే అక్కడ లొకేషన్, ఇక ఇక్కడ షూటింగ్లో పాల్గొన్న నటీనటులెవరో కూడా తెలియదు. కాని కొద్దిపాటి గ్యాప్ తర్వాత బాహుబలి-2 నుండి లీక్ అయిన ఫోటో ఇది. సినిమా తీయడమే కాదు దాన్ని అదే రేంజ్లో ప్రమోట్ చేయగల సత్తా ఉన్న రాజమౌళి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాక డిఫరెంట్ ప్రమోషన్ యాస్పెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.  

ఇప్పటికే 2017 ఏప్రిల్ 28 రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అందుకే సినిమాను అనుకున్న టైం కల్లా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో రేయింభవళ్లు కష్టపడుతున్నారు. మరో రెండు నెలల్లో టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుండగా ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి మొదటి పార్టే ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది మరి ఈ సెకండ్ పార్ట్ ఇంకెన్ని సెన్షేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.