స్టన్నింగ్ లుక్స్ తో వెంకటేష్ 'గురు'

విక్టరీ వెంకటేష్ మళ్లీ ఇదవరకు ఫాం కొనసాగిస్తున్నాడు అని చెప్పడానికి రీసెంట్ గా రిలీజ్ అయిన బాబు బందారం రిజల్ట్ తో చెప్పేయొచ్చు. సినిమా సూపర్ సక్సెస్ కాకపోయినా వెంకటేష్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించాడు మారుతి. ఇక కొద్దికాలంగా రేసులో వెనుకపడ్డ వెంకటేష్ మళ్లీ స్పీడ్ అందుకున్నాడు. బాబు బంగారం రిలీజ్ అయ్యిందో లేదో మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు. అందులో ఒకటి సాలా ఖాదూస్ రీమేక్ కాగా మరోటి కిశోర్ తిరుమల సినిమా.

ఈ రెండిటిలో ముందు సాలా ఖాదూస్ సినిమా రీమేక్ జరుగుతుంది. ఇప్పటికే సినిమా టైటిల్ గురుగా ఎనౌన్స్ చేయగా సినిమా షూటింగ్ కు ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. గురు ఫస్ట్ లుక్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. వెంకటేష్ స్టన్నింగ్ లుక్స్ తో కేక పెట్టించేస్తున్నాడు. ఓ విధంగా వెంకీని ఇలాంటి మాస్ గెటప్లో చూసి చాలా రోజులైందని చెప్పాలి. ఫుల్ మాస్ మసాలాగా కనిపిస్తున్న గురు ఫస్ట్ లుక్కే హిట్ సినిమా పోస్టర్ లా అనిపిస్తుంది. 

మాత్రుక డైరెక్ట్ చేసిన సుధ కొంగర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా అందులో నటించిన రితిక సింగ్ కూడా తెలుగులో లీడ్ రోల్ చేస్తుంది. సెప్టెంబర్ 19 నుండి చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా ఫస్ట్ తోనే అంచనాలను తారా స్థాయిలో పెంచేసింది. కబాలి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను శశికాంత్ నిర్మిస్తున్నారు.