సుమంత్ అనగనగా ఒక రౌడీ.. అసలు కథ ఇది..!

మళ్లీ రావా సినిమాతో ట్రాక్ ఎక్కాడని అనుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ సుబ్రహ్మణ్యపురం పర్వాలేదు అనిపించినా ఇదం జగత్, కపటదారి సినిమాలతో మళ్లీ ఫ్లాపులు అందుకున్నాడు. ప్రస్తుతం సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అనగనగా ఒక రౌడీ. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే షాక్ ఇచ్చిన సుమంత్ ఈ సినిమాలో ఊర మాస్ పాత్రలో కనిపిస్తారని అనుకున్నారు. అయితే ఈ సినిమా సీరియస్ సబ్జెక్ట్ తో కాదు కామెడీ కథతో వస్తుందని టాక్.

2018 మళయాళంలో సూపర్ హిట్టైన పదయోట్టం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు అనగనగా ఒక రౌడీ. గ్యాంగ్ స్టర్ కామెడీ కథతో సుమంత్ మరోసారి తన లక్ టెస్ట్ చేసుకోనున్నాడు. ఈ సినిమాను నూతన దర్శకుడు మను యాగ్న డైరెక్ట్ చేస్తున్నారు. అనగనగా ఒక రౌడీ సుమంత్ మాస్ లుక్ అదిరిపోగా ఈ సినిమా అయినా సుమంత్ ఆశించే స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.