శాకుంతలం నాకు పెద్ద బహుమతి..!

యాభై సినిమాల నా సినీ ప్రయాణంలో యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ అన్ని జానర్ లను చేశాను.. అయితే ఇప్పటివరకు టచ్ చేయని జానర్ మైథలాజికల్. ఆ జానర్ లో సినిమాలు చేయలేకపోయా అన్న వెలితి ఉండేది.. కాని ఆ కల ఈ సినిమాతో తీరడం ఆనందంగా ఉంది అన్నారు సౌత్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత. 

సాధారణంగా పెళ్లైన తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు రావడం చాలా అరుదు. కాని సమంత విషయంలో మాత్రం అలాంటిది ఏమి లేదు. వరుస సినిమా ఆఫర్లు ఆమెకు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వచ్చినవన్ని కాకుండా సమంతే సెలెక్టెడ్ సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శాకుంతలం. డి.ఆర్.పి.. గుణ టీం వర్క్స్ కలిసి సమర్పిస్తున్న ఈ సినిమాను నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సినిమాలో కథానాయకుడిగా మళయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. సినిమా ముహుర్త కార్యక్రమాల్లో సమంత ఈ మూవీలో నటించడం గురించి ఆస్కతికర కామెంట్స్ చేశారు. డిస్నీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని.. బాధ కలిగినప్పుడు డిస్నీ సినిమాలు చూస్తూ ఉంటానని ఆమె అన్నారు. దిల్ రాజు, గుణశేఖర్ కలిసి శాకుంతలం రూపంలో తనకు ఓ పెద్ద బహుమతి ఇస్తున్నారని సమంత అన్నారు.