బుట్ట బొమ్మ రికార్డ్ బ్రేక్ చేసిన సాయి పల్లవి సాంగ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. 2020 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఓ హైలెట్ అనిపించింది. బుట్ట బొమ్మ, అల వైకుంఠపురములో సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాయి. బుట్ట బొమ్మ సాంగ్ 50 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ చేరిపేసింది సాయి పల్లవి సారంగ దరియా సాంగ్.

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియ సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. సుద్ధల అశోక్ తేజ రచించిన ఈ సాంగ్ ను మంగ్లీ పాడారు. సారంగ దరియ సాంగ్ కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించింది. కేవలం లిరికల్ సాంగ్ తోనే ఈ రికార్డ్ సాధిస్తే.. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాక రిలీజయ్యే సారంగ దరియ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సాయి పల్లవి హీరోయిన్ గా సినిమా చేస్తుంది అంటే అందులో ఆమె కోసమే స్పెషల్ గా ఓ సాంగ్ ఉండేలా చూస్తారు. ఫిదా సినిమాలో వచ్చిందే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. మారి 2లో రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది. లేటెస్ట్ గా సాయి పల్లవి సారంగ దరియ సాంగ్ ఆడియెన్స్ ను అలరిస్తుంది.