
స్వప్న సినిమాస్ బ్యానర్ లో పిట్టగోడ ఫేమ్ అనుదీప్ కెవి డైరక్షన్ లో వచ్చిన సినిమా జాతిరత్నాలు. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్ధుల్లా జంటగా నటించగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రమోషన్స్ నుండే సినిమాకు మంచి బజ్ రాగా ఫైనల్ గా సినిమా రిలీజ్ సూపర్ సక్సెస్ అయ్యింది. శివరాత్రి కానుకగా రిలీజైన జారిరత్నాలు సినిమా నాలుగు రోజుల్లో 20 కోట్ల పైగా షేర్ రాబట్టింది.
12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే లాభాలు తెచ్చిపెట్టడం విశేషం. వీకెండ్ లో తెలుగు రెండు రాష్ట్రాల్లో జాతిరత్నాలు ఆడుతున్న థియేటర్స్ అన్ని హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి మేకర్స్ ఏదైతే అనుకున్నారో అంతకుమించి ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ ఇయర్ లో వచ్చిన సినిమాల్లో క్రాక్, ఉప్పెన తర్వాత సూపర్ హిట్ సినిమాగా లిస్ట్ లో చేరింది. కోట్ల కొద్దీ బడ్జెట్.. అదిరిపోయే ట్విస్టులు.. స్టార్ కాస్టింగ్.. ఫారిన్ లొకేషన్స్ ఇవేవి వద్దు రెండు గంటలు సినిమా చూసేందుకు వచ్చిన ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తే చాలని నమ్మిన జాతిరత్నాల టీం ఎఫర్ట్ ఊహించిన దాని కన్నా భారీ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుందని ఈ వసూళ్లు చూస్తుంటేనే అర్ధమవుతుంది.