సీత వచ్చేసిందోచ్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా RRR. రౌద్రం రణం రుధిరం అంటూ ఇద్దరు సూపర్ హీరోస్ తో రాజమౌళి చేస్తున్నే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. సినిమాలో చరణ్ కు జోడీగా సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అలియా భట్ సౌత్ లో అదికూడా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఆమె బర్త్ డే సందర్భంగా సినిమా నుండి సీత ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. సీత పాత్రలో అలియా తన నటనతో మెప్పిస్తుందని తెలుస్తుంది. అక్టోబర్ 13న రిలీజ్ ప్లాన్ చేసిన RRR సినిమా మరో బాహుబలి కాదు కాదు అంతకుమించి అనిపించేలా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.