3 పాత్రలు.. 30 వేషాలు.. టాక్ ఆఫ్ ది టౌన్ గా పవర్ స్టార్ మూవీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీద ఉంటే.. ఆ సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేస్తుంది. 25 సినిమాల కెరియర్ లో ఇంతవరకు ఎప్పుడూ చేయని ఓ పిరియాడికల్ మూవీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అదే హరి హర వీరమల్లు. క్రిష్ డైరక్షన్ లో భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈమధ్యనే సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

17వ శతాబ్ధం నాటి కథతో హరి హర వీరమల్లు సినిమా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో పవన్ మూడు పాత్రల్లో కనిపిస్తారని టాక్.. అంతేకాదు ఈ మూడు పాత్రలతో పాటుగా సినిమా మొత్తం మీద 30 వేషాల్లో కనిపిస్తారని తెలుస్తుంది. 30 వేషాలకు 30 కాస్టూమ్స్ ఏర్పాటు చేస్తున్నారట. తన స్టైల్ తోనే క్రేజీ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న పవర్ స్టార్ కెరియర్ లో మొదటిసారి డిఫరెంట్ గా చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.