మేజర్ ఫస్ట్ గ్లింప్స్.. సూపర్..!

ముంబై 26/11 టెర్రరిస్ట్ ఎటాక్ నేపథ్యంలో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో మేజర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉంటున్నారు. ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాయి. మేజర్ సినిమాలో అడవి శేష్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మార్చ్ 15 మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా మేజర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 

ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా మీద ఓ ఇంప్యాక్ట్ ఏర్పడేలా చేశారు చిత్రయూనిట్. మంటల మధ్యలో అడవి శేష్ నిలబడి ఉంటాడు.. ఆ టైం లో వాకీ టాకీలో మేజర్ సందీప్ నువ్వు ఉన్నావా.. అని వాయిస్ వినిపిస్తుంది.. కాని ఇక్కడ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. మార్చ్ 28న టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 2006లో నవంబర్ 26న తాజ్ హోటల్ లో టెర్రరిస్ట్ ఎలా జరిగింది.. మేజర్ సందీప్ ఎలా అక్కడ ప్రజలను కాపాడాలని అనుకున్నారు. ఈ మారణహోమలో ఆయన ఎలా ప్రాణాలు విడిచారు అన్నది సినిమాలో చూపించబోతున్నారు.