డ్రగ్స్ కేసులో నోటీసులు.. స్పందించిన తనీష్..!

డ్రగ్స్ కేసు అనగానే ఏ సినీ హీరోకి దానితో సంబంధాలు ఉన్నాయన్న మీడియా ఆసక్తి అందరికి తెలిసిందే. ఆమధ్య టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరక్టర్స్, హీరోల దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులకు పంపించి నానా హడావిడి చేశారు. లేటెస్ట్ గా డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యువ హీరో తనీష్ కు నోటీసులు అందాయన్న వార్తలు సంచలనంగా మారాయి. బెంగుళూరు పొలీసులు హీరోకి నోటీసులు ఇచ్చారని విచారణకు పిలిచారని ప్రచారం జరిగింది.      

ఫైనల్ గా ఈ వార్తలపై స్పందించారు తనీష్. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు. నిజానిజాలేమిటో తెలుసుకోకుండా.. తనని ఎవరు సంప్రదించకుండా వేస్తున్న వార్తలు తన ఫ్యామిలీని తీవ్రంగా బాధపెట్టాయని చెప్పారు. బెంగళూరుకి చెందిన నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట వాస్తవమే.. కాని తనకు వచ్చిన నోటీసు అది కాదని.. ఆ నిర్మాత గురించి మీకు వివరాలు తెలిస్తే చెప్పండి అంటూ మాత్రమే నోటీసులు ఇచ్చారని తనీష్ చెప్పారు. అసత్య ప్రచారాలు చేయవద్దని మీడియాని రిక్వెస్ట్ చేశాడు తనీష్. ఇలానే అసత్య ప్రచారాలు చేస్తే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని కూడా అన్నారు యువ హీరో తనీష్.