ఎవరు మీలో కోటీశ్వరులు.. మీ రామారావు.. ప్రోమో అదుర్స్..!

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో సూపర్ సక్సెస్ అయ్యింది. రెండు సీజన్లు నాగ్.. మూడవ సీజన్ మెగాస్టార్ చిరంజీవి హోస్టులుగా చేశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు కాస్త ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అయ్యింది. స్టార్ మా నుండి జెమిని టివికి ఈ షో వచ్చేసింది. హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ టీజర్ దించేశారు.

ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ అని జై లవ కుశ డైలాగ్ లానే అంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న తారక్ టివి హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నాడు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 1తో దుమ్ముదులిపేసిన ఎన్.టి.ఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోతో వస్తున్నాడు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు సైనింగ్ ఆఫ్ మీ రామారావు అంటూ టీజర్ ఎండింగ్ లో షాక్ ఇచ్చాడు తారక్. మొత్తానికి రామారావు అనే పేరుని వాడేశారన్నమాట. ఎవరు మీలో కోటీశ్వరులు టీజర్ నందమూరి ఫ్యాన్స్ కు.. సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది.. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి..