అర్జున్ రెడ్డి డైరక్టర్ తో మహేష్.. ట్విస్ట్ ఏంటంటే..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ పోకిరి లుక్ తో కనిపిస్తాడని టాక్. బ్యాంక్ స్కాం నేపథ్యంలో పొలిటికల్ సెటైర్ మూవీగా సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి కూడా తను చేసే సినిమా మహేష్ తోనే అని చెప్పేశాడు. అయితే సర్కారు వారి పాట తర్వాత మహేష్ రాజమౌళి సినిమాకు ముందు ఒక సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఆ డైరక్టర్స్ లిస్ట్ లో అనీల్ రావిపుడి, వంశీ పైడిపల్లి ఉన్నారు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇదిలాఉంటే సందీప్ వంగతో సినిమా ఏమో కాని ప్రస్తుతానికి ఓ యాడ్ చేస్తున్నారట మహేష్. 

ఓ పక్క సినిమాలతో పాటుగా వాణిజ్య ప్రకటనల్లో కూడా మహేష్ సత్తా చాటుతున్నాడు. అయితే మహేష్ లేటెస్ట్ యాడ్ సందీప్ వంగ డైరక్షన్ లో వస్తుందని తెలుస్తుంది. సో యాడ్ క్లిక్ అయితే సందీప్ వంగతో సినిమా ఫిక్స్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ అని తీసి అక్కడ హిట్ అందుకున్న సందీప్ వంగ ప్రస్తుతం రణ్ భీర్ కపూర్ తో యానిమల్ మూవీ చేస్తున్నాడు.