RRR సీత ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!

రాజమౌళి డైరక్షన్ లో భారీ మూవీగా వస్తున్న సినిమా RRR. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ లు కూడా నటిస్తున్నారు. హాలీవుడ్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది. సినిమాకు సంబందించిన రామరాజు, కొమరం భీమ్ టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇక RRR నుండి త్వరలో సీత లుక్ రిలీజ్ చేస్తున్నారట. మార్చ్ 15న ఉదయం 11 గంటలకు సినిమాలో సీత లుక్ అదేనండి అలియా భట్ లుక్ రివీల్ చేస్తారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రాం చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ R మూవీ అక్టోబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇద్దరి హీరోల అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు చిత్రయూనిట్.