
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప, F3 సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా దృశ్యం 2 సినిమా కూడా ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం ఆరేళ్ల క్రితం వెంకటేష్ రీమేక్ చేయగా రీసెంట్ గా వచ్చిన దృశ్యం 2 కూడా సూపర్ హిట్ అవగా.. ఆ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నారు వెంకటేష్. మాత్రుక దర్శకుడు జీతు జోసేఫ్ డైరెక్ట్ చేస్తున్నారు.
అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఎఫ్3 సినిమా ఆగష్టు 27న రిలీజ్ ప్లాన్ చేశారు. దీనితో పాటుగా నారప్ప కూడా సెట్స్ మీద ఉంది. అయితే F3 కన్నా ముందు దృశ్యం 2 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. కేవలం 25 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. అంటే జూలైలోనే దృశ్యం 2 రిలీజ్ ఉండే ఛాన్సులు ఉన్నాయి. మొత్తానికి ఈ ఇయర్ లో ఎఫ్3, దృశ్యం 2 సినిమాలు కూడా రిలీజ్ ప్లాన్ చేయగా నారప్ప మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారని టాక్.