అల్లు అర్జున్ 'పుష్ప' తగ్గేది లే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ మూవీగా వస్తున్న పుష్ప సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఆగష్టు 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుండి వస్తున్న ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎక్సయిట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పుష్పకి సంబందించిన క్రేజీ లీక్ ఇచ్చేశారు.

కార్తికేయ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ ఈవెంట్ లో మాట్లాడుతూ తగ్గేది లే అన్నాడు. సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ ఊర మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ ఊతపదం తగ్గేది లే అని ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ప్లాన్ చేశాడట సుకుమార్. రంగస్థలం తర్వాత అల్లు అర్జున్ పుష్పతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు సుకుమార్.