
క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమా చేస్తున్నారు. మరాఠి మూవీ నట సామ్రాట్ కు రీమేక్ గా ఈ మూవీ వస్తుంది. సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, ఆలి రెజా లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రంగమార్తాండా రిలీజ్ అవకుండానే కృష్ణవంశీ మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అన్నం టైటిల్ తో కృష్ణవంశీ సినిమా చేస్తున్నారు. అందుకు సంబందించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఒకప్పుడు స్టార్ డైరక్టర్ గా తను ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అందుకున్న కృష్ణవంశీ ఈమధ్య కెరియర్ లో పూర్తిగా వెనక పడ్డారు. నక్షత్రం తర్వాత రంగమార్తాండ సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ ఆ సినిమా రిలీజ్ అవకుండానే అన్నం సినిమాను మొదలు పెట్టారు. బాలకృష్ణతో రైతు సినిమా చేయాలని అనుకుని అది మిస్ అవడంతో అన్నం కథను రాసుకున్నారట కృష్ణవంశీ. మరి అన్నం టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించేలా చేశాడు కృష్ణవంశీ.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అని పోస్టర్ వదిలిన కృష్ణవంశీ ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకుంటున్నాడు అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు.