
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు హరి హర వీరమల్లు టైటిల్ ఫిక్స్ చేశారు. 17వ శతాబ్ధం నాటి కథతో వస్తున్న క్రిష్ ఈ సినిమాలో పవన్ ను కొత్తగా చూపిస్తునారు. ఇక కొన్నాళ్లుగా ఈ సినిమాలో పవర్ స్టార్ ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తుండగా హరి హర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు క్రిష్.
శివరాత్రి సందర్భంగా గురువారం హరి హర వీరమల్లు ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. పవర్ స్టార్ ను ఇదివరకు ఎప్పుడూ చూడని పాత్రలో క్రిష్ అద్భుతాన్ని సృష్టిస్తున్నాడని చెప్పొచ్చు. 2022 జనవరి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ హరి హర వీరమల్లు ఫస్ట్ లుక్ టీజర్ మాత్రం అంచనాలు పెంచేసింది. కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.